ప్రేమించిన యువతి దక్కలేదని అక్కసుతో ….

ప్రేమించిన యువతి పెళ్ళి చెడకొట్టానన్న ఆత్మ క్షోభతో యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా దిబ్బపాలేనికి చెందిన దుల్ల రమేష్‌ (28) అనే వ్యక్తి ఐటీఐ పూర్తిచేసి పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. రమేష్ గతకొంత కాలంగా ఓ యువతి ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి రఘు అనే యువకునితో వివాహం కుదిరింది. దీంతో ఆ యువతి మరొకరికి దక్కకూడదన్న అక్కసుతో ఆమె పెళ్లిని చెడగొట్టాడు. రమేష్‌.. రఘు వద్దకు వెళ్లి తాను ఆ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి కూడా తనను ప్రేమిస్తోంది అని చెప్పడంతో రఘు ఆ యువతితో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొన్న పోలిసులు పూచీకత్తుపై విడుదల చేశారు. ఇంటికి చేరుకున్న రమేష్‌ మనస్తాపానికి గురై దువ్వాడ రైల్వేస్టేష్టన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. “నేను తప్పు చేశాను. నాది వన్‌సైడ్‌ లవ్‌.. ఆమెను దక్కించుకోడానికి తనపై అనవసర నిందలు వేశాను. రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని” కోరుతూ లేఖ రాశాడు.