పొలిటికల్ ఎంట్రీపై మరోసారి స్పందించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Ex CBI JD, Lakshminarayana, jd responds, jd political entry

ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయాలే ఏకైక మార్గం అన్న భావన కలిగితే రాజయకీయరంగ ప్రవేశం గురించి ఆలోచిస్తానని మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆదర్శభావాలతో ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే మేధావులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో మార్పు సాధ్యమన్నారు.సమాజానికి ఉపయోగపడే విధంగా యువతలో చేతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు.