హీరో శ్రీకాంత్ ఐదు పైసల ఛాలెంజ్!

hero, srikanth, open challenge, 5paisa challenge, srikanth challenge, maa association

“మా” సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కార్యవర్గ సభ్యుడు హీరో శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి తప్పూ జరగలేదని స్పష్టం చేశారు. “మా” అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో ఈవెంట్లు చేస్తున్నామని ఈ డబ్బులన్నీ సంఘం కోసమే ఖర్చుపెడతామని శ్రీకాంత్ అన్నారు. ఐదుపైసలు దుర్వినియోగం అయినట్టు నిరూపించినా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే అభియోగం మోపిన వారు అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు హీరో శ్రీకాంత్.