ఫస్ట్‌నైట్ రోజే భార్యకు నరకం చూపించిన భర్త

పెళ్లై 24 గంటలు గడవక ముందే భార్యకు ఫైస్ట్ నైట్ రోజే నరకం చూపించాడో శాడిస్ట్. బెడ్‌రూమ్‌లో ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి, ఆ తర్వాత తాను నపుంసకుడినని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే… న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. కొద్ది రోజులు ఈ టార్చర్ భరించిన అమ్మాయి చివరికి అత్తకు విషయం చెప్పింది. దీంతో.. ఆవిడ కూడా రివర్స్ అయ్యింది. కొడుకుతో కలిసి సాధించడం మొదలుపెట్టింది. కోడలికి టీబీ రోగం ఉన్నందున సంసారానికి పనికిరాదని నిందలు వేశారు. దీంతో.. ఆ అమ్మాయి టెస్ట్‌లు చేయించుకుని తనకు ఎలాంటి రోగం లేదని రిపోర్ట్ చూపించడంతో అత్తింటివాళ్లు వెనక్కితగ్గారు. ఇంట్లోంచి పరారయ్యారు. ఇంతలోనే అతను రెండో పెళ్లికి సిద్ధమయ్యాడన్న విషయం తెలుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, కంప్లెంట్ ఇచ్చింది.

దగ్గరి బంధువు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఆకర్షణీయమైన జీతం అని నమ్మి.. పెళ్లి చేస్తే తమ కూతురు జీవితం కష్టాలపాలైందని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన త్రివేణికి, మాచాని రాజేంద్ర ప్రసాద్‌కు గతేడాది ఆగస్టు 2న వివాహమైంది. 45 లక్షలు కట్నం ఇచ్చి దూమ్ ధామ్‌గా పెళ్లి చేశారు. ఐతే.. ఫస్ట్‌నైట్ రోజే రాజేంద్రప్రసాద్‌శాడిస్ట్‌లా మారి ఆమెకు నరకం చూపించాడు. ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశాడు. తనలో లోపాన్ని దాచిపెట్టి.. అదనపు కట్నం డిమాండ్ చేశాడు. మళ్లీ 10 లక్షలు గుంజాడు. తర్వాత కూడా తీరు మారలేదు. ఇదే విషయంపై అత్తను బాధితురాలు ప్రశ్నించడంతో ఆమెకు టీబీ ఉందని నిందలు వేసి.. ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం చేశారు. పెద్దలు రంగంలోకి దిగి పంచాయితీ చేసినా వివాదం కొలిక్కిరాలేదు. విడాకులు తీసుకునేందుకు భర్త ప్రయత్నించడంతో.. త్రివేణి మానసికంగా కుంగిపోయింది. తన తప్పు ఏమీ లేకపోయినా తనను వేధించి చివరకు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అటు, ఈ విషయంపై పోలీసు కేసు పెట్టినందుకు అమ్మాయి కుటుంబ సభ్యులపై రాజేంద్రప్రసాద్ మరింత కక్ష పెంచుకున్నాడు. బెదిరింపులకు దిగాడు. దీంతో.. త్రివేణి తల్లిదండ్రులు భయపడి సొంతిల్లు వదిలేశారు. కర్నూలు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. భర్త, అత్తింటి వాళ్లు పెట్టిన చిత్రహింలు తట్టుకోలేని బాధితురాలు త్రివేణి అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. తన జీవితంతో ఆడుకున్న రాజేంద్రను, అతని కుటుంబ సభ్యుల్ని కఠినంగా శిక్షించాలని బాధితరాలు కోరుతోంది. అటు, తనపై వచ్చిన ఆరోపణలను రాజేంద్ర తోసిపుచ్చారు. తన భార్య ప్రవర్తన బాగాలేదని అంటున్నాడు. ఫస్ట్‌నైట్ రోజు తాను వీడియోలు తీసినట్టు చెప్తున్న మాటలన్నీ అబద్ధమంటున్నాడు. తన కుటుంబంపై కావాలనే తప్పుడు నిందలు వేస్తున్నారని చెప్పుకొస్తున్నాడు. తాను నపుంసకుడినంటూ వస్తున్న ఆరోపణలపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నాడు.