సినిమా హిట్‌కి ముద్దులు, మురిపాలు దారులు..!!

ఓ సినిమా హిట్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి. మంచి కథ, మంచి నటులు, టెక్నికల్ వాల్యూస్, ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు.. వీటన్నిటినీ కరెక్ట్ గా సమన్వయం చేసుకునే దర్శకుడుంటే చాలు.. ఇది మామూలుగా ఎవరైనా అంటారు. కానీ ఇప్పుడు సినిమాలు హిట్ కావాలంటే అంతకు మించి మరొకటుండాలి. అదేంటో తెలుసా.. అధర చుంబనం.. యస్.. లిప్ లాక్ లు ఇప్పుడు సినిమా సక్సెస్ లో కీ పాయింట్ అవుతున్నాయ్.. మొన్నటి వరకూ మన సినిమాల్లో లిప్ లాక్ ఉందంటే అదేదో బి గ్రేడ్ సినిమాలా చూసేవారు. కానీ అర్జున్ రెడ్డి ఆ లెక్కలను మార్చాడు.

ముద్దంటే అదో ఎమోషన్ అంటూ సింపుల్ గా తేల్చాడు. కథ డిమాండ్ చేస్తే ముద్దుంటే తప్పేంటీ అనే పాజిటివ్ వైబ్స్ ను కూడా క్రియట్ చేశాడీ అర్జున్ రెడ్డి. ఇక ఆ సినిమాలో లెక్కలేనన్ని లిప్ లాక్స్ ఉన్నా.. అవేవీ జుగుప్సగా ఉండవు. అందుకే ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత చాలామంది ఈ లిప్ లాక్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక ఈ యేడాది జెన్యూన్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి ఆర్ఎక్స్ హండ్రెడ్. ఈ సినిమాలో కూడా అదిరిపోయే లిప్ లాక్స్ ఉన్నాయి. అలాగని ఇవేవీ కావాలని ఇరికించినవి కావు. అందుకే సినిమా అంత విజయం సాధించింది. ఒక రకంగా ఈసినిమా విజయంలో ఈ లిప్ లాక్స్ ది కూడా ఓ కీలకమైన పాత్ర అనుకోవచ్చు.

చాలా చిన్నసినిమాగా అంతా కొత్తవారితో వచ్చిన ఈ సినిమా ఏకంగా 14కోట్లు షేర్ వసూలు చేసి టాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేసింది. అర్జున్ రెడ్డి సెట్ చేసిన ఈ ముద్దుల హంగామా లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గీత గోవిందంలో కూడా ఈ అనుకోని అధర చుంబనం ఆకట్టుకుంటుంది. అదే సినిమాకు కీలకంగా మారుతుంది. ఒక రకంగా ఈ లిప్ లాక్ లేకపోతే సినిమాలో అంత కాన్ ఫ్లిక్ట్ ఉండేది కాదు. అంటే లిప్ లాక్ సినిమాలోనూ భాగం అవుతున్నాయనుకోవచ్చు.

ఇక ఏ ఇండస్ట్రీకైనా ఓ ట్రెండ్ అంటూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో లిప్ లాక్స్ ట్రెండ్ నడుస్తోంది. అది హిట్ కు సెంటిమెంట్ గానూ ఉండటంతో చాలా కథల్లో ఈ అధర చుంబనాలకు కొదవ లేకుండా కథలు తయారవుతున్నాయి. ఇక ఈ ట్రెండ్ ను క్యాచ్ చేయడమే కాదు.. ఏకంగా టైటిల్ నే 24కిస్సెస్(ట్వెంటీఫోర్ అని చదవాలి)అనే సినిమా వస్తోంది. కుమారి 21ఎఫ్ బ్యూటీ హెబ్బా పటేల్, అదిత్ అరుణ్ జంటగా నటిస్తోన్న ఈ మూవీకి మిణుగురులు వంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన అయోధ్యకుమార్
దర్శకుడు కావడం విశేషం.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ముద్దులతోనే కాదు.. ఎమోషన్స్ తోనూ అట్రాక్ట్ చేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక లేటెస్ట్ గా వస్తోన్న యంగ్ స్టర్స్ మూవీ శుభలేఖలులో కూడా ఇలాంటి ఓ ఘాటైన అధర చుంబనం ఉంది. చూడ్డానికి ట్రెడిషనల్ గా కనిపించినా.. ఈ మూవీలో మరో యాంగిల్ కూడా ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. అర్బన్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న శుభలేఖలు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి ట్రెండీ సెంటిమెంట్ ఈ సినిమాకూ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ట్రెండ్ కదా అని ప్రతిసారీ వర్కవుట్ కాదు. ఒక్కోసారి కంటెంట్ బావున్నా.. కథనం ఆకట్టుకోలేకపోవచ్చు. లేదా మరేవైనా కారణాలు కావొచ్చు..

ఈ మధ్య విడుదలైన సమీరమ్ అనే సినిమాలోనూ ఇలాంటి ఘాటైన అధర చుంబనాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియదు. అంటే లిప్ లాక్ ఉన్నంత మాత్రానే సినిమాలు హిట్ కావు. దానికి సరిపడా కంటెంట్ కూడా ఉండాలని అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు ప్రూవ్ చేస్తుంటాయి. మరి ఈ అధర చుంబనాల ట్రెండ్ ఎన్నాళ్లుంటుందో.. ఆ తర్వాత ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో కానీ.. ప్రస్తుతం తెలుగు సినిమా కథలన్నిట్లోనూ మాగ్జిమం ఈ లిప్ లాక్ సీన్లు ఉంటూ ఆడియన్స్‌ని థియేటర్ వైపు లాక్కెళుతున్నాయి.