కిట్టయ్య గొప్పదనమంతా.. ఆ అమ్మ చలవే!

అమ్మ ప్రేమకు మించింది ఈ లోకాన ఏదీ లేదు! అవును. అందుకే ఆ దేవదేవుడే తల్లి ప్రేమ కోసం మానవ రూపంలో ఎన్నో అవతారాలెత్తాడు. అందులోనూ ద్వాపర యుగంలో.. కృష్ణావతారంలో ఉన్న కిట్టయ్యకు ఇద్దరు అమ్మలు. దేవకీ పుత్రుడిగా ఈ భూమ్మీదకు వచ్చినా.. యశోద గారాలపట్టిగా.. గోకులాన్ని ఏలాడు. అందుకే… ఎవరు ఎంత ఎదిగినా.. ఆ తల్లికి మాత్రం బిడ్డే. యశోదమ్మ ప్రేమే నందగోపాలుడిని అందలమెక్కించింది. లోకాన జగద్గురువుగా నిలిపింది. ప్రపంచానికి వెలకట్టలేని వ్యక్తిత్వాన్ని అందించింది.

ఈ కంప్యూటర్ యుగంలోనూ మనిషి.. కృష్ణ తత్వాన్ని వదల్లేకపోతున్నాడు. అలాంటి గోపాలుడిని ఈ లోకానికి చూపించింది యశోదమ్మే కదా. ఆ అమ్మ అనురాగం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ, తప్పు చేసినా సరే అక్కున చేర్చుకునే తల్లి మనసు, దీవెనలే.. కన్నయ్యను అంతటివాడిని చేశాయి. అందుకే గోవిందుడి బాల్యమంతా హాయిగా గడిచిపోయింది. ఇప్పటికీ కృష్ణుడంటే.. ఆ అల్లరి చేష్టలు, చిలిపి పనులే గుర్తొస్తాయి. ముద్దులొలికే కిట్టయ్య రూపమే కళ్లముందు కదలాడుతుంది. అంటే.. యశోదమ్మ తల్లి ప్రేమకు బానిసైన శ్రీకృష్ణుడి రూపమే ఇప్పటికీ అందరికీ గుర్తు.

కృష్ణాష్టమి రోజున.. తమ పిల్లలను బుజ్జి కిట్టయ్యలుగా అలంకరించి.. యశోదమ్మల్లాంటి ఆ తల్లులు సంతోషపడతారు. బుజ్జి పాపాయిలను రాధగా అలంకరిస్తారు. లోకాన్నే నడిపించే కృష్ణుడిని నడిపించింది యశోదమ్మే. అందుకే.. కిట్టయ్య జన్మదినాన.. ఆ అమ్మకు శతకోటి వందనాలు. కృష్ణం వందే జగద్గురుం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.