రజనీకాంత్‌ ఇంట విషాదం.. శోక సంద్రంలో సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వదిన ‘కళావతి గైక్వాడ్‌’ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సమాచారం తెలుసుకున్న రజనీ.. కుటుంబ సమేతంగా.. హుటాహుటిన బెంగళూరు తరలివచ్చారు. ఐదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన రజనీని కళావతి పెంచి పెద్ద చేశారు. తల్లిలాంటి వదినను కోల్పోవడంతో రజనీకాంత్‌ శోక సంద్రంలో మునిగిపోయారు.