కూతురు హీరోయిన్‌గా ట్రై చేస్తానంటే వద్దంటున్న స్టార్ కమెడియన్

సినిమా ఇండస్ట్రీలోకి తమ ఇంటి ఆడపిల్లలను తీసుకురావాలంటే పెద్ద ఆసక్తిని చూపరు పేరు ప్రఖ్యాతులున్న పెద్ద హీరోలు సైతం. టాలీవుడ్‌లో అది మరీ ఎక్కువ. కొడుకులను పరిచయం చేసినంత త్వరగా కూతుళ్లను తీసుకురావడానికి ఇష్టపడరు. కారణాలు ఏవైనా బయటకు కనిపించేంత అందమైన రంగుల ప్రపంచం కాదని వారి భయం. తాజాగా ఓ స్టార్ కమెడియన్ కూతురు హీరోయిన్‌గా ట్రై చేస్తాను నాన్నా అంటే.. వద్దు తల్లీ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

నాన్న వద్దంటున్న వినకుండా ఈ లోపు తన ప్రయత్నాలు తాను చేస్తోంది. కూతురిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో విదేశాలు వెళ్లి విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకోమని అంటున్నారు. ఇక కమెడియన్ భార్య కూడా కూతురికే సపోర్ట్ చేస్తోంది. ఆమెను హీరోయిన్‌గా తెరపై చూడాలనుకుంటోంది. ఇలా అయితే భార్యకు విడాకులు ఇచ్చేస్తానంటున్నారు డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఫేమస్ అయిన ఈ స్టార్ కమెడియన్.