క్యూట్ బంగారు.. మరో సూపర్ స్టారు..

చిన్నారులు ఏం మాట్లాడినా ముద్దుగానే ఉంటుంది. దానికి అభినయం కూడా తోడైతే.. ఎవరైనా సరే.. వెళ్లి ఎత్తుకుని ఓ ముద్దిచ్చేయాలనిపిస్తుంది. అచ్చంగా అలానే అనిపిస్తుంది ఈ క్యూట్ బేబీని చూస్తుంటే. డబ్ స్మాష్ చెబుతూ డాడీ.. నేను సినిమాల్లోకి పనికొస్తానా అని అడుగుతున్నట్లే ఉంది.

పెద్దయిన తరువాత ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు కానీ ఇప్పుడు ఈ చిన్నారి కళ్లతో చేసే అభినయం, చేతులతో చేసే చమత్కారం, పెదాలపై పలికే పాట ఓ క్షణం పాటు మనల్ని మైమరపిస్తుంది. వావ్.. బంగారు సూపర్‌గా చేస్తున్నావురా కన్నా అని అంటారు ఎవరైనా. చిన్నారులు ఏం చెప్పినా వెంటనే పట్టేస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉండాలే కానీ చదువుతో పాటు మరికొన్ని రంగాల్లో ప్రావీణ్యం కనబరుస్తారు. చేయూతనందిస్తే తామేంటో ప్రపంచానికి చాటి చెబుతారు. అందం, అభినయం కలబోసి ఉన్న ఈ క్యూట్ బేబీ కూడా పెద్దయ్యాక సూపర్ స్టార్ హీరోయిన్ అవుతుందేమో.. ఎవరు చెప్పగలరు.. ఎవరిలో ఏ ప్రతిభ దాగి ఉందో.