ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

కుసుమ అనే నిరుద్యోగ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కడప జిల్లాలోని రాయచోటి పట్టణంలో చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించింది.” నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. అలాంటప్పుడు నేను చచ్చినా..బతికిన ఒక్కటే అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను ” అని సూసైడ్‌ నోట్‌‌లో రాసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మురళీకృష్ణ అనే వ్యక్తి భార్య కుసుమతో కలిసి రాయచోటి పట్టణ పరిధిలోని బోస్‌ నగర్‌లో నివిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కలసి రాయచోటి పట్టణానికి వచ్చి ప్రైవేట్‌ సంస్థలలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కుసుమ ప్రవేట్ సంస్థలో పనిచేస్తూ పోటి పరీక్షలకు సిద్ధం అవుతోంది. ఉద్యొగం సంపాదించాలనే పట్టుదలతో ఇంటిలోనే ఉంటూ ఎంతో శ్రద్ధగా చదివేది. గత పోటీ పరీక్షలలో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది.