తొలి కలయిక రోజు విపరీతమైన నొప్పి అందుకే వస్తుందా?

first night

పువ్వులలోని మకరంద కోసం తుమ్మెదలు ఎంతలా ఆరాటపడి దాన్ని ఆస్వాదిస్తాయో.. తొలి కలయికను కూడా అంతలా ఆస్వాదించాలని నూతన దంపతులు ఆరాట పడుతుంటారు. తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో.. తొలి కలయిక కూడా అంతే మధురంగా ఉండాలని భావిస్తుంటారు. కానీ ఆ సమయంలో కలిగే భాద, విపరీతమైన నొప్పితో పాటు మరికొన్ని సమస్యల కారణంగా తమ జీవితంలో ఈ మధరమైన అనుభవాలను ఆనందించలేకపోతున్నారు. సెప్టెంబరు 4 వరల్డ్‌ సెక్సువల్‌ హెల్త్‌ డే సందర్భంగా తొలి కలయిక వల్ల వచ్చే సమస్యలపై అవగాహన పెంచుకుని, పరిష్కార మార్గల్ని తెలుసుకుంటే జీవితాంతం ఆనందంగా గడపవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

ఎక్కువ మంది స్త్రీలు తొలి శృంగార అనుభవాన్ని ఆనందించలేకపోవడానికి ప్రధాన కారణం నొప్పి తద్వారా వచ్చే బాధ. శారీరక సమస్యల కన్నా, మానసిక భయాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది స్త్రీలు ఈ నొప్పికి కారణం తమకు యోని ముఖద్వారం చాలా చిన్నగా ఉండటం వల్లే ఆ సమయంలో నొప్పి వస్తోందని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఎక్కువ శాతం మంది మహిళల్లో అలాంటిదేమీ ఉండదంటున్నారు నిపుణులు. తొలి కలయిక విపరీతమైన నొప్పితో ముగుస్తుందనే నమ్మకం ఏర్పడడానికి ప్రధాన కారణం… ‘కన్నెపొర’! కొందరిలో ఇది కాస్త మందంగా ఉండి అంగప్రవేశానికి ఆటంకం కలిగించవచ్చు. ఇది ఎంతో అరుదు. నిజానికి ఎక్కువశాతం మంది అమ్మాయిల్లో కన్నెపొర సైకిల్ తొక్కేటప్పుడో లేకుంటే ఆటలాడేటప్పుడో చిరిగిపోతుంది. కాబట్టి విపరీతమైన నొప్పికి ఆస్కారం ఉండదంటున్నారు సెక్స్ నిపుణులు.

శృంగార సమయంలో నొప్పి సమస్య దాదాపు 20 నుంచి 50 శాతం మహిళల్లో ఉంటుందంటున్నారు. దీనికి కారణం ఫ్రెండ్స్ పెట్టే రకరకాల భయాలు, పుస్తకాల ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు కావచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఆపోహల కారణంగా ఎక్కువ మంది కలయిక అంటేనే విపరీతంగా భయపడిపోతారట. దాంతో ఆ సమయంలో యోని కండరాలు బిగుసుకుపోయి సరిగ్గా సహకరించలేని పరిస్థితి ఎదురవుతుంది. దీనికి సరైన పరిష్కారం శృంగార సమయంలో ఇద్దరిమధ్యా ఉండాల్సిన అవగాహన అంటున్నారు నిపుణులు. ఇతర విషయాలు చర్చించుకున్నట్లుగానే మీరూ, మీ భాగస్వామితో సెక్స్ సమయంలో ఎదురవుతోన్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ. భయాల్ని పంచుకుంటూ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇలాంటి భయాలను తొలగించవచ్చు. సెక్స్ పట్ల భయం పోయేకొద్దీ, రకరకాల భంగిమలు ప్రయత్నించడం వల్ల భావప్రాప్తిని కూడా పూర్తిస్థాయిలో పొందే అవకాశముంటున్నారు.

చాలా మంది తొలి కలయికలో బయపడటానికి మరో కారణం సుఖవ్యాధులు వస్తాయేమోనని.. కానీ ఇది కేవలం భయం మాత్రమే.. సుఖవ్యాధులు అందరికీ రావు. దీన్నుంచి బయటపడాలంటే డాక్టర్‌తో కన్నా భాగస్వామితో నిజాయతీగా చర్చించాలి అంటున్నారు సెక్స్‌ థెరపిస్ట్‌లు. సురక్షిత లైంగికజీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ చిన్న సమస్య కలిగినా, సందేహం అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. మరీ చిన్న వయసు నుంచీ సెక్స్‌లో పాల్గొనడం, ఒకరికన్నా ఎక్కువమందితో శృంగారంలో పాల్గొనడం ఆనందించడం, పెళ్లికి ముందే అపరిచిత వ్యక్తులతో హద్దులు దాటి శృంగారంలో పాల్గొనడం రోగాలు వస్తాయి తప్ప అన్ని సందర్భాల్లోనూ రావు అంటున్నారు నిపుణలు.

లైంగిక జీవితంలో సమస్యలు లేకుండా ఆనందించాలంటే భార్యభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థల్ని వీలైనంత వరకూ దూరం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరికిఒకరై.. మనసుకి మససై.. తోడునీడగా ఉంటే ఎంతటి సమస్య అయినా మీ ముందు బలాదూర్!

గమనిక: లైంగిక జీవితంలో ఎటువంటి పోహలు ఉన్నా వాటిని దూరం చేసుకోవడానికి సెక్స్‌ థెరపిస్ట్‌ని సంప్రదించడం మంచిది.