బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు..

దాదాపు 70 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. తక్కువ ఓటింగ్ రావడంతో ఈ మధ్యే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. గత వారం ప్రసారమైన తమిళ్ బిగ్‌బాస్ 2 రియాల్టీ షోలో మంచి క్రేజ్ సంపాదించుకున్న డానియేల్ ప్రియురాలు డెనీషాను వివాహం చేసుకున్నారు.

డెనీషా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సోమవారం డానియేల్ డెనీషాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబసమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ ప్రేమని అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని డానియేల్ ట్విట్టర్‌ వేదికగా కోరారు. అభిమానుల కోసం పెళ్లిఫొటోని పోస్ట్ చేశారు.