రైల్వే ట్రాక్‌పై కుప్పకూలిన బ్రిడ్జి

కోల్‌కతాలో బ్రిడ్జి కుప్పకూలింది. అలీపూర్‌ ప్రాంతంలోని మజర్‌హట్‌‌ వంతెన కూలటంతో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే ట్రాక్‌పై కూలటంతో నష్ట తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

అగ్నిమాపక సిబ్బందితో పాటు..డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడ్డ పలువుర్ని ఇప్పటికే ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల నుంచి రక్షించినవారిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి గాయాలయ్యాయి.