దమ్ముంటే సస్పెండ్‌ చేయాలి.. టీఆర్‌ఎస్‌కు బహిరంగ లేఖ రాసిన డీఎస్‌

తనంతట తానుగా.. టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేయబోనన్నారు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌. అలా చేస్తే తనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పారు. దమ్ముంటే తనను సస్పెండ్‌ చేయాలని, లేదంటే తనపై జిల్లా పార్టీ చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డానన్న ఆరోపణలు తీవ్రంగా బాధించాయన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, కుటుంబాన్ని కూడా రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు సంజయ్‌పై కేసులు పెట్టించారన్నారు. కేసీఆర్‌కు చెప్పినా సీరియస్‌గా తీసుకోలేదని డీఎస్‌ చెప్పారు. కేసీఆర్‌ ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ జరిగిన నష్టాన్ని ప్రశ్నించానని గుర్తు చేశారు. డీఎస్‌ అంటే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ.. టీఆర్‌ఎస్‌ పార్టీకి బహిరంగ లేఖ రాశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -