కొత్త వంద నోటు వచ్చేసింది..

పాత కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. కొత్త రూ.2 వేల నోటు, కొత్త రూ.500, రూ.10, రూ.50,రూ.200 నోట్లతో పాటు తాజాగా రూ.100ల నోటు కూడా చెలామణిలోకి వచ్చింది. వినియోగ దారుడికి కాస్త చిల్లర వెసులుబాటుకు వీలవుతుంది. ఈనెల 1నుంచి కొత్త 100 నోటు అమల్లోకి వస్తోంది. నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, వెనుకవైపు రాణికీ వాస్ ముద్రించి ఉన్న ఈ నోటు వంగపూవు రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం వెడల్పుతో, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తయారు చేసినట్లు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. గాంధీతో పాటు అశోకుడి నాలుగు సింహాలు, వాటర్ మార్క్, స్వచ్ఛ భారత్ లోగో వంటివి ఈ నోటుపై ముద్రించి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాత రూ.100 నోటు కూడా చెలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.