కుప్పకూలిన ఫ్లై ఓవర్‌.. రెండేళ్లలో రెండోసారి!

bridge collapse

కోల్‌కతాలోని ముజరహట్ ఫ్లై ఓవర్‌ కుప్పకూలి ఐదుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అలీపోర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్జి కింద ఒక మినీ బస్సు, పలు కార్లు ధ్వంసం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు..డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడ్డ పలువుర్ని ఇప్పటికే ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 25 మందిని సురక్షితంగా రక్షించారు.

దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి నాసిరకం పనుల వల్లే కూలిందనే అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దశబ్దంతో ఫ్లైఓవర్‌ రెండు ముక్కలై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా దుమ్ముదూళి పేరుకుపోయి కొన్ని క్షణాల వరకు ఏం జరిగిందో తెలియని పరిస్తితి. ఫ్లై ఓవర్‌ మీద నుంచి వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలు ధ్వసం అయ్యాయి. బీతావహన వాతావరణం ఏర్పడింది. వెంటనే తేరుకున్న స్థానికులు సహాయక చర్యలను ప్రారంభించారు. అటు సమీపంలోనే ఉన్న ఆర్మీతో పాటు పోలీసులు, అగ్నిపమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.

ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కూలిన దుర్ఘటనపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ముందు సహాయక చర్యలపైనే దృష్టి సారించనట్లు చెప్పారామె. ప్రస్తుతం డార్జిలింగ్‌ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ కోల్‌కతా బయల్దేరుతున్నట్లు తెలిపారు. సహాయక చర్యల అనంతరం ఘటనపై విచారణ ప్రారంభిస్తామని అన్నారామె.

గత రెండేళ్లలో కోల్‌కతాలో బ్రిడ్జి కూలిపోవటం ఇది రెండో సారి. 2016 మార్చిలో నిర్మాణంలో స్టీల్‌ బ్రిడ్జి కుప్పకూలింది. రద్దీగా ఉంటే బుర్రా బజార్‌ లో జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది మృతిచెందారు. 90 మందికి గాయాలయ్యాయి. ఇక ఇప్పుడు అలీపోర్‌ ప్రాంతంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.