పెళ్ళి.. కలలకి, కెరీర్‌కి అడ్డుగా.. : సమంత

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం. అభిరుచులు వేరైనా ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయలకు ఒకరు విలువిస్తూ ఒకే కప్పుకింద చేసే సంసారం. ఆలూమగల మద్య చిన్న చిన్న తగాదాలు ఉన్నా అవి చినికి చినికి గాలివాన అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటే ఆ సంసారం సాగర సంగమమవుతుంది.

వివాహం అనేది ఒకరికొకరు భరోసానిచ్చేదిగా ఉండాలి.. అంతే కానీ తన కలలకు, కెరీర్‌గా అడ్డుకట్టవేసేదిగా ఉండకూడదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పెళ్లి తరువాత నాలో మరింత ధైర్యం పెరిగింది. అక్కినేని వారింటి కోడల్ని కావడమే నాధైర్యానికి కారణం అంటూ ఓ ఇంటర్వ్యూలో సమంత తన మనసులోని మాటను వెల్లడించింది. ఆమె నటించిన యూటర్న్ చిత్రం ఈ నెల 13న విడుదల కానున్న సందర్భంగా కర్మ థీమ్ అనే వీడియో సాంగ్‌ను ట్విటర్‌లో విడుదల చేసింది. ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

* యూటర్న్ సినిమా చూడాలి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా..
నాకోసం కాదు కథ కోసం చూడండి.
* నాగార్జున గారి గురించి మీ అభిప్రాయం
వారింటి కోడల్ని కావడం నా అదృష్టం
* చైతన్యతో జీవితం ఎలా ఉంది
చైతూ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్
* మీలో స్ఫూర్తి నింపేవారు
పాజిటివ్‌గా ఆలోచించే వారు నాకు స్ఫూర్తి
* కేరాఫ్ కంచర పాలెం గురించిన మీ అభిప్రాయం
మంచి సినిమా రాబోతున్నందుకు ఆనందంగా ఉంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -