చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆడియాలజీ విద్యార్థిని..

student, suicide

చదువు పూర్తయింది.. అప్రెంటీస్‌గా చేస్తోంది.. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నాననంటూ తల్లిదండ్రుల దగ్గర మొరపెట్టుకుంది. వారు సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అంప్రెటీస్ షిప్ పూర్తి చేసుకుని రమ్మన్నారు. వెళ్లలేనంటూ ఉరివేసుకుని జీవితాన్ని ముగించేసింది ఆడియాలజీ విద్యార్థిని.

వేంపల్లెకు చెందిన లావణ్య కడపలో ఆడియాలజీ కోర్సు పూర్తిచేసింది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో అప్రెంటీస్ చేస్తోంది. చదవలేక పోతున్నాను.. ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేకున్నాను అంటూ కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది లావణ్య. దీంతో ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు తల్లిదండ్రులు. అప్రెంటీస్‌ పూర్తిచేయాలని సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో లావణ్య ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు లేచి గమనించగా పక్కగదిలో లావణ్య ఉరివేసుకొని కనిపించింది.
చదువులో వెనకబడి పోతున్నా, ఒత్తిడికి గురవుతున్నాను, నా చావుకు ఎవరూ కారణం కాదంటూ లావణ్య రాసిన సూసైడ్‌ నోట్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.