నేనే రాజకీయాలు చేయదలచుకుంటే ఇలానే చేస్తాను : విజయ్ దేవరకొండ

vijay-devarakonda-nota-first-look-release

టాలీవుడ్ లో విజయాల రేటుతో పాటు లక్కున్న యువ హీరోలలో ముందుంటాడు విజయ్ దేవరకొండ. నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతోంది. దీంతో విజయ్ నిర్మాతల బంగారుకొండగా మారాడు. తాజాగా ‘గీత గోవిందం’ సినిమాతో మొదటిసారి సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజకీయాల్లో తిరుగుబాటు చేసిన ఓ యంగ్‌ పొలిటీషియన్‌గా ఈ చిత్రం కథ ఉండబుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం సినిమా ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్బంగా రాజకీయాలపై స్పందించారు విజయ్ దేవరకొండ.. ‘నాకు రాజకీయాలంటే చిరాకు. కానీ, ఒకవేళ నేనే రాజకీయాలు చేయదలచుకుంటే ఇలానే చేస్తాను’ అని ఈ సినిమా కథ ను వర్ణించారు. ఇందులో విజయ్‌ దేవరకొండ సరసన మెహరీన్‌ కథానాయిక, తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతోంది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -