బాబోయ్ ఇదేం పాము.. ఇంత భయంకరంగా..

yellow-collared-wolf-snake-found-at-kurnool-in-andhrapradesh

శ్రీశైలం నల్లమల అడవుల్లో అరుదైన పాము రెస్క్యూ టీమ్ కంటపడింది. స్నేక్‌ రెస్క్యూ చేపట్టిన బయోల్యాబ్‌ సిబ్బంది.. సున్నిపెంట పరిసరాల్లో ఈ పామును పట్టుకున్నారు. ఇలాంటి పాములు ఐదు రకాలుగా ఉంటాయని.. నల్లమలలో ఈ రకమైన పాముని గుర్తించడం  ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఇది లైకోడాన్‌ ప్లోవికొల్లిస్‌ రకానికి చెందిన పామని.. శ్రీశైలం అభయారణ్యంలో ఇలాంటివే నాలుగు రకాల పాములను గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -