వైయస్ హయాంలో లాభాల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీ ప్రస్తుతం 45వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది : వైయస్ జగన్

ys-jagan-padhayatra-updates

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర.. విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. 253వ రోజు పాదయాత్ర కె.కోటపాడు వద్ద ముగిసింది. మొల్కలాపల్లి శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తపెంట, ఎ.భీమవరం, పడుగుపాలెం మీదుగా ఎ.కోడూరు. కె.కోటపాడు వరకు సాగింది.


కె కోటపాడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. చోడవరం సహకార షుగర్ ఫ్యాక్టరీని సీఎం చంద్రబాబు అప్పుల ఊభిలోకి నెట్టేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ ప్రస్తుతం 45వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడమే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక సహకారం రంగంలోని ఫ్యాక్టరీలు, డైరీలు మూతపడుతున్నాయని ఫైర్ అయ్యారు.

విశాఖలో హుద్‌హుద్‌ గాయాలు ఇప్పటికీ మానలేదన్నారు జగన్. మట్టి మాఫియా ధనదాహానికి పచ్చని పల్లెలు రూపుకోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాడగులలో డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. హక్కుల కోసం నిరసన తెలిపై వారిపై చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారని జగన్ ఆరోపించారు. నారా హమారా టీడీపీ హమారా మొదలు కొని తుని రైలు ఘటన వరకు చంద్రబాబు తప్పులు చేసి.. వైసీపీపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.

మద్య నిషేధం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సహా ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోలేదని జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి ఏంతో కీలమైన ప్రత్యేక హోదాను కూడా తన స్వార్ధ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని అన్నారు. టీడీపీ పాలనలో కేవలం అవినీతి, అన్యాయం, అక్రమాలు తప్ప ఏమీ లేదన్నారు.

ప్రజాసంకల్పయాత్ర 254వ రోజు జోగన్నపాలెం శివారు నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె.సంతపాలెం చంద్రయ్యపేట, అయ్యన్నపాలెం మీదుగా బుదిరెడ్డిపాలెం క్రాస్‌ వరకు సంకల్పయాత్ర కొనసాగుతుంది.