చూపులు ఒకమ్మాయితో.. పెళ్లి మరో అమ్మాయితో.. బాధతో వరుడు..

పెళ్లి చూపులకు రమ్మని కబురు చేస్తే వెళ్లాడు. అమ్మాయి నచ్చడంతో ఓకే అన్నాడు. ఈ నెల 2న వివాహం కూడా జరిగింది. అంతలోనే ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. పెళ్లైన రెండు రోజులకే ప్రాణాలు తీసుకున్నాడు. కారణాలు విచారిస్తే.. విజయనగరానికి చెందిన మదీన్ చీపురుపల్లి మండలంలోని పెదనడపల్లిలో వీఆర్‌వోగా పనిచేస్తున్నాడు. ఈమధ్య బ్యాంకు పరీక్షల్లో కూడా విజయం సాధించాడు.

తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలనుకోవడంతో సంబందం చూశామని కబురు చేస్తే వెళ్లాడు. సాలూరుకు చెందిన మహ్మద్ మోబినాతో పెళ్లి చూపులు జరిగాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం 3న విజయనగరం చేరుకున్నారు. 4న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులందరూ వేడుక ఏర్పాట్లలో సంతోషంగా ఉండగా.. మదీన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. బాబామెట్టకు చెందిన వారి పాత ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. పెళ్లైన రెండో రోజే బిడ్డ అలా కనపించేసరికి తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

పెళ్లి చూపుల్లో ఒకమ్మాయిని చూపించి మరో అమ్మాయితో వివాహం జరిపించడాన్ని జీర్ణించుకోలేకే, మోసపోయానన్న బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డని ఆ పరిస్థితిలో చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులంతా విచారంలో మునిగిపోయారు. వరుడికి, వారి కుటుంబసభ్యులకి ముందుగానే ఈ విషయాన్ని తెలిపినా మదీన్ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని వధువు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇష్టం లేకపోతే మొదటే చెప్పి ఉండాల్సింది అని కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -