బిగ్‌బాస్ గొడవ.. నానీపై విమర్శలు..

అత్యధిక ప్రజాదరణ పొందుతున్న బుల్లితెర షో బిగ్‌బాస్2 చివరి దశకు చేరుకుంది. ఎంత పాపులర్ అయ్యిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నూతన్ నాయుడి ఎలిమినేషన్ సరిగా జరగలేదని ఎక్కువ ఓట్లు వచ్చినా అతడిని షో నుంచి కావాలనే తప్పించారని నానీని ట్రోల్ చేస్తున్నారు. గీతామాధురి, తనీష్‌లో ఎవరో ఒకరిని బిగ్‌బాస్ విన్నర్‌గా ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ షో నిర్వాహకులను, హోస్ట్ నానీని విమర్శిస్తున్నారు. దీనికి స్పందించిన నానీ.. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి.

షోలోని ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. కానీ నాకు హౌస్‌లోని వారంతా ఒక్కటే. ప్రత్యేకంగా ఎవరినీ సపోర్ట్ చేయను. మీరు వేసే ఓట్లతోనే వారు ఇంటిలో ఉండాలా లేదా అనే నిర్ణయం జరుగుతుంది. మీరు ఈ విషయంలో నన్ను విమర్శించినా వాస్తవం మాత్రం ఇదే. మీరంతా నాకుటుంబ సభ్యుల్లాంటి వారు. మీ ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాను. షోను బాగా నిర్వహించాలని హౌస్‌లోని వారందర్నీ హ్యాపీగా ఉంచాలని చూస్తుంటాను. అంతేకానీ ఎలిమినేషన్ విషయంలో ఎవరి జోక్యం ఉండదు. ఆడియన్స్ ఓటింగ్‌మీదే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.