పడవ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. 26 మంది గల్లంతు..

boat accident

గువాహటిలో దారుణం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 26 మంది గల్లంతు అయినట్లు సమాచారం. తీరం నుంచి 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.పడవలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఓ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో పడవ రెండు ముక్కలైంది. కొందరు ప్రయాణికులు ఈదుతూ సురక్షితంగా బయటకు రాగలిగారు. గల్లంతు అయిన వారికోసం రాష్ట్ర విపత్తు స్పందన దళం సహాయక చర్యలు చేపట్టింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.