ఎవరూ ఆ ఫ్లైట్‌లో ప్రయాణించొద్దు: ఈషా రెబ్బ

Eesha Rebba
Eesha Rebba

ఎవరు కూడా ఇండిగో విమానంలో ప్రయాణించొద్దని అంటోంది హీరోయిన్ ఈషారెబ్బ. ‘నెవర్ ఫ్లై ఆన్ ఇండిగో, అవాయిడ్ ఇండిగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసి ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది. ‘ఇండిగో కారణంగా నేను ఫ్లైట్ మిస్ అవడం వారంలో ఇది రెండోసారి. ఇండిగో ఉద్యోగులకు ఉన్న ఇగో కారణంగానే
నేను విమానం మిస్ అయ్యాను’ అంటూ తానుపడిన బాధను ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఓ ప్రయాణికుడు ఇండిగో సిబ్బంది వలన ఎదుర్కున్న బాధను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన ఈషారెబ్బ ‘‘మీరు చెప్పింది నిజం. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌నే ఇండిగో కారణంగా చాలా సార్లు ఫేస్ చేశాను. ఎవరు ఆ విమానం ఎక్కకూడదని ప్రతి ఒక్కరినీ అర్థిస్తున్నా’’ అంటూ పై విధంగా స్పందిస్తూ రీ ట్వీట్‌ చేసింది.