బీజేపీలోకి సూపర్ స్టార్..? ప్రధానిని కలిసి..

malayala-super-star-mohanlal-maybe-join-in-bjp

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయపార్టీలు ప్రజాకర్షణ కలిగిన సెలబ్రిటీల కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇటీవల ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్, ఎమ్మెస్ ధోని లను కలిశారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. అయితే వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గతకొంత కాలంగా మోహన్ లాల్ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రధానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్నీ స్వయంగా మోహన్ లాల్ తెలియజేశారు. ‘జన్మాష్టమి రోజు ప్రధానిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. గ్లోబల్‌ మలయాళీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంపూర్ణ సహకారం అందించడానికి ప్రధాని ఒప్పుకొన్నారు. ఇది కేరళలో కొత్త ఒరవడిని తీసుకువస్తుంది’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా మోహన్ లాల్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున తిరువనంతపురం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

 malayala-super-star-mohanlal-maybe-join-in-bjp

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -