తాబేలుకు ముద్దివ్వబోతే….

సాహసాలు చేయడం చాలామంది యువకులకు సరదా. కానీ అది హద్దు దాటితే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అది జంతువులతో సరదా అంటే మరీ డేంజర్. తాజాగా మైఖేల్ గ్యానిలి అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి ఫిష్ హంటింగ్ కోసం స్ధానిక కొలను వద్దకు వెళ్ళాడు. హటింగ్ చేస్తున్న సమయంలో తాబేలు కనిపించడంతో దానిని నీటిలో నుంచి బయట తీసి సరాదగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అది ఒక్కసారిగా మైఖేల్ పెదాలను కొరికేసింది దీంతో బాధతో గట్టిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.