ప్రియుడు 10.. ప్రియురాలు 9.. ఆత్మహత్య..!!

minor girl, minor boy, suicide, railway track

రైలుకింద పడి మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగింది. రైల్వే ట్రాక్ వద్ద పడివున్న స్కూల్ బ్యాగుల ఆధారంగా బాలుడు 10వ తరగతి, బాలిక 9వ తరగతి చదువుతునట్లు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో పెద్దలు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఈ జంట.. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.