దొంగ దొరికిపోయాడు ఎలాగంటే..

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్లు ఓ దొంగ దొంగతనం చేస్తూ తనని ఎవరు చూడడం లేదు అనుకొని మూడో నేత్రానికి అడ్డంగా దోరికిపోయాడు. పోలీసులను చూసి జంకని చోరులు పెరుగుతున్న టెక్నాలజీ మాత్రం వారిని భయపెడుతుంది. తాజాగా ఓ వ్యక్తి జేబులో నుంచి పర్స్ కొట్టేసిన దొంగ దాన్ని అతని జేబులో పెట్టుకునే సమయంలో ఎదురుగా ఉన్నCCTV కెమెరాను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే పర్సును తిరిగి అతని జేబులో పెట్టేశాడు. ముంటైలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ముంబై పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -