కార్తికేయ చేతుల మీదుగా ‘రథం’ టీజర్

ratham-movie-poster-released

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్తతరహా సినిమాల ట్రెండ్ మొదలయింది. ఇటీవల డిఫరెంట్ స్టోరీస్తో తెరకెక్కిన సినిమాలు మాక్జిమం సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ‘RX100’ , ‘గీత గోవిందం’ సినిమాలు కొత్త తరహా కథలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. అదే తరహాలో మరో సినిమా రూపొందుతోంది. గీతానంద్, చాందిని హీరో హీరోయిన్లుగా ‘రథం’ తెరకెక్కుతోంది. ఈ సినిమాను రాజుగారు ఫిలిమ్స్ పతాకంపై.. రాజా ధారపునేని నిర్మిస్తుండగా.. కే వినోద్ సమర్పిస్తున్నారు. ఇవాళ RX100 హీరో కార్తీకేయ చేతుల మీదుగా ‘రథం’ టీజర్ ను ఆవిష్కరించనున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీకి కెమెరామెన్.. సునీల్ ముత్యాల, మ్యూజిక్.. సుకుమార్ పమ్మి. నరేన్, రాజ్ ముదిరాజ్, ప్రమోదిని, మిర్చి మాధవి, రామ్ తదితరులు నటిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.