‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా…

sailaja reddy alludu

అక్కినేని వారసుడు నాగ చైతన్య వెండితెరమీద అల్లుడిగా సందండి చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య, అందాల తార అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌తో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

నాగ చైతన్య లుక్స్, టీజర్ చివరిలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఇక అభిమానులు ఎంతో ఆశగా చూసే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ముహర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ జరుగనుంది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ టీవీ5 లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రచారం కానుంది.

మరో విశేషం ఏంటంటే ఈ ఈవెంట్‌కు కింగ్ నాగార్జున తో పాటు నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి రమ్య కృష్ణ శైలజారెడ్డి పాత్రలో కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 13న విడుదల కానుంది.