ఎస్సై బూతు పురాణం.. వైరల్

si

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి ఎస్సై శంకర్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. గో మాంసాన్ని తినేవారిని తిడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సాయి అనే యువకుడిపై కేసు నమోదు చేసిన ఎస్సై… వారం రోజుల పాటు స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేశాడు. ఎనిమిదో రోజు స్టేషన్‌కు రానందుకు.. ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. అదంతా రికార్డు చేసిన యువకుడు.. ఎస్సై బూతు పురాణాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. ఇంతకు ముందు కూడా ఎస్సై శంకర్‌రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. సర్వీస్‌ రివాల్వర్‌ పోగొట్టుకున్న ఘటనలో ఉన్నతాధికారులు మందలించినా.. అతని తీరులో మాత్రం మార్పు రాలేదు.