పాముల బ్యాంకు.. వాటికి ఆహారం అందించాలంటే..

అచ్చంగా బ్యాంకు లాకర్‌లా ఉంది ఆ పాముల బ్యాంకు. బాక్సులన్నింటిలో పాములే ఉన్నాయి. ఇక్కడ వాటికి ఆహారం వేయడం కూడా ఓ ఉద్యోగం. అందుకే ఓ వ్యక్తి అస్సలేమాత్రం భయంలేకుండా వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. పాముని చూస్తేనే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టేస్తారు జనం. మరలాంటిది ఇక్కడ బాక్సు ఓపెన్ చేయగానే అందులోంచి పాము ఆహారం కోసం వేచి చూస్తున్నట్టు ఒక్కసారిగా అతడి మీదకు వచ్చేస్తుంది. అయినా ఏమాత్రం అదరక బెదరక అతడు ఆహారం అందించే తీరుని చూస్తుంటే ఒళ్లంతా వణుకు వచ్చేస్తుంది.

హాయిగా చెట్లు, పుట్టల వెంట తిరగాల్సిన పాముల్ని ఇక్కడ బంధించడానికి కారణం ఇది పాముల పరిశోధనశాల. వాళ్లు కనుగొన్న పాములకి పేర్లు, అవి విషసర్పాలా కాదా లాంటి విషయాలు, కరిస్తే వాటికి విరుగుడు వంటి విషయాలన్నింటి మీద అధ్యయనం నిర్వహిస్తారు. అందుకే వాటిని కంటికి రెప్పలా కాపడతారు. సమయానికి ఆహారాన్ని అందిస్తున్నారు. వాటి మధ్యే ఉండడంతో అవి విషసర్పాలు.. తమకి హాని చేస్తాయన్న విషయాన్ని మరిచి పోతారు. అందుకేనేమో అవి కూడా అంతే జాగ్రత్తగా అతడందించే ఆహారం మాత్రమే తీసుకుని బుద్దిగా బాక్సులోకి వెళ్లిపోతుంది.