అవమాన భారంతో యువతి ఆత్మహత్యాయత్నం.. దీంతో యువకుడు..

woman

ఆకతాయి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామంలో ఓ యువతిని కొన్నాళ్లుగా భీమయ్య అనే యువకుడు వేధిస్తున్నాడు. ఇది తట్టుకోలేకపోయిన బాధితురాలు అవమాన భారంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను పొన్నురులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో అక్కడ చావుబతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతోంది. బాధితురాలిని బాపట్ల డీఎస్పీ గంగాధరం పరామర్శించారు. అటు, అమ్మాయి పురుగుల మందు తాగిన విషయం తెలిసి ఆ యువకుడు భీమయ్య కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతను కూడా పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం భీమయ్య కూడా పొన్నురులోనే మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతను కోలుకున్నాక వేధింపులకు సంబంధించిన కేసుపై ప్రశ్నించనున్నారు.