ముఖ్యమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. సభకు హాజరుకావాలని స్పీకర్‌ తమను కోరారని అందులో గుర్తుచేశారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 22 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. వెంటనే సమావేశాలకు హాజరువతామని తెలిపారు. మా కష్టంతో గెలిచిన సభ్యులను.. డబ్బుతో కొని సభలో కూర్చోబెడుతున్నారని విమర్శించారు. ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని.. మరోసారి కలవడం ఇష్టంలేకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు.