పామును పట్టుకోవడానికి ఓ సర్దార్జీ ఎంత సాహసం చేశాడో.. వీడియో

చిన్నప్పుడు పాముల్ని బుట్టలో పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ నాలుగు రోడ్ల కూడలిలో వాటిని ఆడించేవాళ్లు. చుట్టూ మూగిన జనం పాము విన్యాసాల్ని చూసి డబ్బులు వేసేవారు. పాములు వారి జీవనాధారంగా బ్రతికేవాళ్లు. ఎంతైనా అవి విషసర్పాలు. కాటు వేశాయంటే ప్రాణాలు పోవలసిందే. జీవితాల్ని ఫణంగా పెట్టి కూటికోసం కోటి విద్యలన్నట్లు వాటిని ఆడిస్తూ జీవనం సాగించేవారు. ఇక్కడ సర్దార్జీ కూడా ఓ పాముతో అలాంటి సాహసమే చేస్తున్నారు. చూసేవారికి ఆ పాము అతడిని కాటేస్తుందేమో అని అనిపిస్తుంది.

పెంపుడు జంతువుల లిస్టులో పాము కూడా చేరిందా అన్నట్లు సర్దార్జీ అత్యంత చాకచక్యంగా ఏమాత్రం భయం లేకుండా పాముని పట్టుకున్న తీరు చూపరులను ఆకర్షించింది. ఎలాంటి ఆయుధాలు తన వద్ద లేవు. ఒక్క సంచి మాత్రమే ఉంది. ఓ సమయంలో ఆసంచిని కూడా పాము పట్టేసుకుంది. అయినా కూడా పిల్లల దగ్గర్నుంచి తీసుకున్నంత ఈజీగా తన సంచిని తీసేసుకున్నారు. అందులోనే దాన్ని బంధించి ఎంచక్కా భుజాన వేసుకుని వెళ్లి పోయారు. సర్దార్జీ.. మీరు మామూలోళ్లు కాదు.