అలెక్సాపై ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్.. వీడియో..

మారుతున్న టెక్నాలజీతో మనుషులు ఎన్నో చిత్రాలు చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో ఇబ్బందులు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. ఏదైనా పొరపాటు జరిగితే ఎన్నితిప్పలో అనుభవిస్తున్న వారికే అర్థమవుతుంది. తాజాగా మహేంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ర మహీంద్ర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేంద్ర తరచూ ఇన్నోవేటివ్ ఐడియాలను, మార్గదర్శకంగా వుండే వారి గురించి ట్వీట‌ర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు పోస్ట్ చేసింది మాత్రం ఓ ఫన్నీ వీడియో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ గురించి ట్వీట్ చేశారు.

అలెక్సా గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆహ్వానించాలి అంటూ సరదాగా కామెంట్ చేశారు. అలెక్సా వాయిస్ కమాండ్ ఆధారంగా పనిచేసే ఓ యువకుడి కష్టాలు ఏ విధంగా వుంటాయో చూడమంటూ వీడియో పెట్టారు. నిజానికి అలెక్సా ఒక సంచలనమనే చెప్పాలి. వినియోగదారులను అలరించేవిధంగా సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. లైటు, ఏసీ, టీవీలను అలెక్సా అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఇవే కాకుండా క్రికెట్ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్, మ్యూజిక్ లాంటి వివరాలు కూడా నేరుగా వాయిస్ కమాండ్ ద్వారా పొందవచ్చు. అంతేకాదు క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు.