శైలజా రెడ్డి అల్లుడు నన్ను కొత్తగా ప్రజెంట్ చేస్తుంది.. : అను ఇమ్మానుయేల్

– KUMAR SRIRAMANENI

గమ్యాన్ని కాకుండా గమనాన్ని ప్రేమించడం బలమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అను ఇమ్మానుయేల్ మాటల్లో అలాంటి వ్యక్తిత్వమే కనిపించింది. ఇప్పుడంతా తాను లర్నింగ్ ప్రోసెస్ లో ఉన్నానంటున్న అనుఇమ్మానుయేల్ ‘శైలజా రెడ్డిఅల్లుడు’ తనకు కొత్త ఇమేజ్ ని తెస్తుందని నమ్ముతుంది. సెప్టెంబర్ 13న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ:

నా పాత్ర గురించి చెప్పాలంటే:
నాకు ఇగోయిస్టిక్ యాంగ్రీ గాళ్ క్యారెక్టర్ ని ప్లే చేసాను. రమ్య గారికి కూతురిగా కనిపిస్తాను. ఈ సినిమా లో నా పాత్ర పేరు అను మొదట జానకి అనుకున్నారు. నా ప్రీవియస్ సినిమాలో క్యారెక్టర్ నేమ్ అదే కావడంతో డైరెక్టర్ నా పేరు నే ఉంచారు.

మీ పాత్ర తో నేను చాలా వరకూ రిలేట్ అవుతాను:
సెట్ లో వారందరూ నా పాత్ర నే నేను చేస్తున్నాను అన్నారు. నాకు ఈ పాత్రకు ఉన్నంత ఇగో లేదు కానీ కొంత వరకూ నేను రిలేట్ అవుతాను. అందరికీ ఏంతో కొంత ఇగో ఉంటుంది. ఈ పాత్రకు చాలా ఉంది. ఈ పాత్రలో ఉన్న కొన్ని షేడ్స్ నాలో ఉన్నాయి.

 

ఈ పాత్ర చాలా లౌడ్ గా ఉంటుంది:
ఇప్పటి వరకూ చేసిన పాత్రలు చాలా సైలెంట్ గా ఉన్నాను . కానీ ఈ పాత్ర చాలా లౌడ్ గా ఉంటుంది. ఇదేమీ నాకు పెద్ద కష్టం అనిపించలేదు.

నా లోకి యాక్టింగ్ ని చూస్తారు:
ఈ పాత్ర తో నాకు యాక్టర్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది. మారుతి గారి వర్క్ ఛాలెంజ్ గా ఉంటుంది. చైతన్య కూడా కొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపించాడు.

 

‘చై’ అందులో నెంబర్ 1:
ఇప్పడు వరకూ చేసిన కోస్టార్స్ లో చైతన్య మోస్ట్ కంఫర్టబుల్ కో స్టార్.

రమ్య గారి లో గ్రేస్ వండర్ పుల్:
రమ్య గారి లోని గ్రేస్ నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెప్పుడూ డైలాగ్ పేపర్ ని చూడటం చూడలేదు. ఆమె సెట్ లో ఉంటే వాతావరణం మారిపోతుంది.

నా ఇగోకి వారే బలౌతారు:
నా ఇగో నేచర్ ని నేను ఎవరి మీద చూపించను. నేను మనుషులతో కలసే వరకూ తొందరగా మాట్లాడలేను. నా స్టాఫే దాన్ని భరిస్తారు ( నవ్వూతూ)

తనకు తానే ఇంపార్టెంట్:
నా పాత్ర గురించి చెప్పాలంటే ఏ ఇగో పర్సన్ అయినా తనే నెంబర్ వన్ అనుకుంటుంది. చుట్టు పక్కల ఉన్న వాళ్ళంతా స్టుపిడ్స్ లా చూస్తుంది. కానీ తను ప్రేమిస్తే మాత్రం అది చాలా ఎక్కువుగా ఉంటుంది. నాకు త్వరగా వస్తుంది.. ఎక్కువుగా వస్తుంది. కానీ అది కరెక్ట్ పర్సన్ మీదే చూపిస్తాను.

రమ్య గారి దగ్గర నేర్చుకున్నది అదే:
ఆమె ఎప్పుటి నుండో ఇండస్ట్రీలో ఉన్నారు. చాలావిషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని నా రీసెంట్ సినిమాలు ఆశించినంత సక్సెస్ కాలేదు.. సినిమా హిట్ అయినా ప్లాఫ్ అయినా అది మన చేతుల్లో ఉండదు. కానీ సినిమా జరిగే ప్రోసెస్ ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాను.

 

సినిమాలు ఆడవు అని ఎలా అనుకుంటాను:
పవన్ సార్, అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నప్పుడు అవి ఫెయిల్ అవుతాయిని ఎలా అనుకుంటాం. కానీ ఫెయిల్యూర్స్ నా కంట్రోల్ లో ఉండవు. శ్రుతి హాసన్ కూడా కెరియర్ మొదట్లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యారు. ఇదంతా నాకు లర్నింగ్ ప్రోసెస్ అనుకుంటాను. అజ్ఞాతవాసి కథ విన్నాను. నా పాత్ర అత్తారింటికి దారేది లో ప్రణిత పాత్ర లా ఉండదు అని త్రివిక్రమ్ గారు కన్ ఫర్మ్ చేసాకే సైన్ చేసాను. మహానటి లాగా దర్శకుడు ఇచ్చిన ఏదో ఒక పాత్ర మీ లైఫ్ ని సెట్ చేస్తుంది.

గీతా గోవిందం మిస్ అయ్యినందుకు :
ఆ రోల్ నాకు బాగా నచ్చింది..ఆ రోల్ నాకు బాగా నచ్చింది. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వచ్చింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ కోసం వదులు కున్నాను. డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తే కామియో చేసాను.
మిస్ అయ్యాననే ఫీల్ మాత్రం ఉంది.

ఎక్స్ పెరిమెంట్స్ చేసే స్టేజ్ లో లేను:
ప్రస్తుతానికి నేను కొత్త మూవీస్ ఏమీ సైన్ చేయలేదు. మంచి రోల్స్ కోసం చూస్తున్నాను. తప్పలనుండి నేర్చుకునే ప్రోసస్ లో ఉన్నాను.

మారుతి నన్ను కొత్త గా ప్రజెంట్ చేసాడు:
ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంత వరకూ చేసిన పాత్రలలో నేను పెద్దగా మాట్లాడలేదు. కానీఇందులో చాలా లౌడ్ గా ఉంటాను. రమ్య గారికి, చై కు నాకు మద్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

కామెడీ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు:
నా ఇగోయిస్టిగ్ క్యారెక్టర్ నుండి ఫన్ జనరేట్ అవుతుంది. నా పాత్ర తీరు నుండే కొన్ని సిట్యువేషన్స్ లో కామెడీ పుడుతుంది.

డ్రీమ్స్ రోల్స్ లేవు:
మహానటి లాంటి పాత్రను కీర్తి ఊహించి ఉండదు. కానీ ఆ పాత్ర ఆమెను డిఫరెంట్ లెవల్ కి తీసుకెళ్ళింది. అలాంటివి వచ్చినప్పుడు ఆర్టిస్ట్ కి టర్న్ వస్తుంది..అలాంటి పాత్ర ల కోసం చూస్తున్నా..
నేను ఎవర్నీ కాంపిటేటర్ గా ఫీల్ అవ్వను.

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -