ఇదొక మెమరబుల్ మూమెంట్ : యంయం కీరవాణి

Chithra garu, Sunitha shared the mic for NTR biopic... memorable moment

చిత్ర, సునీత.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరికి ఓ ప్రత్యేకత ఉంది. మెలోడీ పాటలు పాడటం, సమ్మోహనమైన హమ్మింగ్ ఇవ్వడంలో వీరికి వీరే సాటి.. ఎంతమంది సింగర్లు వచ్చినా ఇండస్ట్రీలో వీరిద్దరికి ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో ఓ పాట రూపొందింది. అదే ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో..అరుదుగా వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో పాట పాడారు. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు యంయం కీరవాణి చిత్ర, సునీత దిగిన ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేశాడు. ఇదొక మెమరబుల్ మూమెంట్ అని అందులో పేర్కొన్నాడు.