సీనియర్‌ హాస్యనటుడు మృతి

తమిళ సినీ పరిశ్రమ మరో సీనియర్‌ హాస్యనటుడిని కోల్పోయింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ గా పేరొందిన రాకెట్‌ రామనాథన్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రామనాథన్ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య భానుమతి, కొడుకు గురు బాలాజీ, కూతు రు సాయిబాల ఉన్నారు. తమిళంలో పలువురు నటులకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గారామనాథన్ వ్యవహరించారు.. ఆ తరువాత నటుడిగా మారి నామ్, స్పరిశం, మన్‌సోరు, కోవిల్‌యానై తదితర చిత్రాల్లో నటించారు. అయన కళాప్రతిభకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డును, నడిగర్‌ సంఘం నుంచి కలచ్ఛసెల్వం బిరుదును అందుకున్నారు. అయన మృతిపట్ల దక్షిణ భారత నటీనటుల (నడిగర్) సంఘం సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖలు కూడా రామనాథన్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

comedy-actor-rocket-ramanathan-passes-away