వీడియో: బాగా నిద్రొస్తోంది.. డిస్ట్రబ్ చేయకు ప్లీజ్: క్లాసులో చిన్నారి

అమ్మానాన్న ఆఫీస్‌కి వెళ్లాలని పొద్దున్నే నన్ను కూడా నిద్ర లేపేస్తారు. నిద్ర కళ్లమీదే బ్రష్ చేయాలి బ్రెడ్ తినాలి, పాలు తాగాలి. వెంటనే స్కూల్‌కి రెడీ చేసి పంపించేస్తారు. మరి నాకేమో నిద్ర సరిపోవట్లేదు. ఎలా చెయ్యాలి. అందుకే ఇక్కడ బజ్జున్నాను. ఎందుకురా లేపుతావు. ఆడుకోడానికి రమ్మంటే వస్తానుగాని, ఎబీసీడీలు మాత్రం చెప్పను గాక చెప్పను. నాకు అమ్మ ఎప్పుడో నేర్పించేసింది. కావాలంటే నిద్ర లేచాక చెబుతాను. రాత్రి పక్కింట్లోని ఓ చిన్ని అన్నయ్యది బర్త్‌డే పార్టీ అయితే వెళ్లాను. అక్కడ బాగా ఆడుకున్నాము పిల్లలందరం. అందుకే అలసి పోయాను. మీకోసం నాకు అన్న పార్టీలో ఇచ్చిన చాక్లెట్లు కూడా తెచ్చాను. నన్ను లేపకుండా వుంటే బజ్జుని లేచాక ఇస్తాను. లేదంటే మొత్తం నేనే తినేస్తాను. ప్లీజ్.. ప్రణవ్ లేపకురా .. నిద్రపోతున్నాను.. బై.. గుడ్‌నైట్.. మరి నేనెప్పుడు నిద్ర పోతే అప్పుడే నాకు నైట్.. అందుకే. ఓ బుజ్జి పాప క్లాసు రూంలో నిద్రపోతున్న వీడియో వైరల్ అవుతోంది.