సారూ.. రూల్స్ మీరే బ్రేక్ చేస్తే.. హెల్మెట్ లేకుండా ASI..

ఏదైనా చెప్పేముందు ఆచరించాలి. అది కనీస విద్యుక్తధర్మం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు ప్రాణాలు పోతాయ్ అంటూ ఎంత హెచ్చరించినా వినని ప్రజల గురించి తలలు పట్టుకుంటోంది సర్కారు. ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి మరీ అలర్ట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. మరి అలాంటి పోలీస్ సారే హెల్మెట్ లేకుండా బండి మీద రయ్ మంటూ దూసుకుపోతే.. మా దగ్గరా కెమేరా ఫోన్ ఉందంటూ క్లిక్ మనిపించాడు నగర పౌరుడు.

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ASI రాజేందర్‌ హెల్మెట్ లేకుండా బండి డ్రైవ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్లిక్ మనిపించి టక్కున బిల్ పంపించేస్తారు. మరి మరే ఇలా చేస్తే ఎలా అండీ అంటూ.. ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేశాడు. దీనిపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ASIని CP ఆఫీసుకు అటాచ్ చేశారు.