రాజమౌళి ఇంటికి కోడలుగా రానున్న జగపతిబాబు కూతురు!

ss rajamouli son karthikeya will going to marry with pooja

త్వరలో దర్శకుడు రాజమౌళి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రమారాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళికొడుకు కాబోతున్నాడు. హీరో జగపతిబాబు అన్న రామ్ ప్రసాద్ కూతురు పూజతో అతని వివాహం జరగనుంది. ఈ మేరకు నిన్నరాత్రి(బుధవారం) నిశ్చితార్ధం జరిగింది. శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రావిణ్యం సంపాదించిన పూజ ప్రస్తుతం డివోషనల్ ఆల్బస్ చేస్తోంది. ఆమె తండ్రి రామ్ ప్రసాద్ గతంలో నాగార్జునతో చంద్రలేఖ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. వీరి ప్రేమను ఇరుకుటుంబాల అంగీకరించడంతో రెండు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలయింది. ప్రస్తుతం కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్తికేయ పూజ ప్రేమలో మునిగితేలుతున్నాడు. పూజ తో లవ్ లో ఉన్న విషయాన్నీ కార్తికేయ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -