స్వలింగ సంప‍ర్కంపై సుప్రీం సంచలన తీర్పు

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కం నేరకాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ తరువాత ఐ.పి.సి సెక్షన్‌ 377ను సుప్రీం కోర్టు కొట్టేసింది. దీనిపై ఐదుగురు సభ్యుల దర్మాసనం ఏకగ్రీవంగా తీర్పిచ్చింది. పరస్పర సహకారంతో చేసే సంపర్కం ఏమాత్రం తప్పు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కులకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కాన్ని చట్ట బద్దం చేస్తే సుప్రీం ఇచ్చిన తీరుపై ఆ వర్గం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

-ADVT-