అక్కడ చేపల వర్షం కురుస్తోంది…

కొన్ని వింత పరిణామాలు, విచిత్రమైన ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజెన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది.వేలాది చేపలను విమానంలో తీసుకెళ్ళి వాటిని కొండ ప్రాంతాలలో ఉన్న చెరువులలో జారవిడుస్తున్నారు. వస్తువులో, మనుషులో ఉండాల్సిన విమానంలో చేపలు ఏంటి అనుకుంటున్నారా..! అమెరికాలోని యుటా రాష్ట్రంలో వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్ సంస్థ కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికి ఈ పద్ధతిని ఫాలోఅవుతోంది.విమానంలోని కింది భాగంలో ఉన్న భారీ రంధ్రం నుంచి చేపలను కింద ఉన్న చెరువులోకి జార విడుస్తున్నారు. దట్టమైన అడవులు ఉండే కొండ ప్రాంతాలలో రవాణ మార్గం సాధ్యపడదు కావున ఈ పద్దతిలో అక్కడ చేపల పెంపకం చేపడుతున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.