కొడంగల్‌లో రేవంత్‌పై పోటీ చేస్తుంది ఎవరో తెలుసా?

Revanth reddy
Revanth reddy

టిఆర్‌ఎస్ మెుదటినుంచి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తుంది.రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతగా ఉన్న రేవంత్‌ తెరాసకు ప్రధాన ప్రత్యర్థిగా మారాడు.కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డికి పట్టున్న నియోజకవర్గం కొడంగల్‌లో అతడిని ఎలాగైనా ఓడించాలని చూస్తోంది. రేవంత్‌కు పోటీగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని తెరాస అభ్యర్థిగా ప్రకటించింది.ఇప్పటికే కొడంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన టీఆర్ఎస్ ఆయనను ఓడించాలని గట్టి నిర్ణయంతో ఉంది. రాబోయే ఎన్నికలలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.