మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : జగన్‌

ys jagan prajasankalpa yatra update

ముఖ్యమంత్రి చంద్రబాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారంటూ నిప్పులు చెరిగారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి.. అక్రమాలకు పెదబాబు పర్మిషన్‌ ఇస్తే.. చినబాబు కమిషన్‌ వసూలు చేసుకుంటారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌.. సబ్బవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పెందుర్తి నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్‌ మండిపడ్డారు. ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఎన్నో గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అధికారంలోకి రాగానే ఎన్టీపీసీ సమస్యను పరిష్కరిస్తామని జగన్‌ చెప్పారు.

బుధవారం జగన్‌ 10.2 కిలోమీటర్లు నడిచారు.. రావులమ్మపాలెం క్రాస్‌ నుంచి ఆదిరెడ్డిపాలెం మీదుగా సబ్బవరం, చిన్న గొల్లలపాలెం వరకు పాదయాత్ర సాగింది.. ఇప్పటి వరకు జగన్‌ 2904 కిలోమీటర్లు నడిచారు. ఇక నేడు అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదుగా జెర్రిపోతులవారి పాలెం వరకు జగన్‌ పాదయాత్ర చేపడతారు.

Recommended For You