భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం

at-delhi-2-2-meet-us-india-seek-to-deepen-defence-ties-sign-key-accord

భారత్, అమెరికా మధ్య రక్షణ బంధం బలోపేతం దిశగా కీలక అడుగు పడింది. సుదీర్ఘ కాలం చర్చల తరువాత.. రెండు దేశాల మధ్య ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా క్లిష్టమైన రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అమెరికా నుంచి భారత సైన్యానికి అందనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఢిల్లీలో జరిగిన తొలి 2 ప్లస్ 2 చర్చల్లో ఒప్పదం కుదిరింది. ఈ భేటీలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి మేటిస్ పాల్గొన్నారు. ఒప్పందాలను ఖరారు చేశారు.

అణుసరఫరా దేశాల కూటమి NSGలో భారత ప్రవేశానికి ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు సుష్మాస్వరాజ్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంపై కూడా చర్చించినట్లు తెలిపిన ఆమె.. విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్ 1 బి వీసాల విషయంలో భారతీయుల ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్ణయం తీసుకోవద్దని అమెరికాను కోరినట్లు సుష్మ స్వరాజ్ చెప్పారు.ఈ ఒప్పందం ద్వారా భారత రక్షణ సామర్ధ్యంతో పాటు యుద్ధ సన్నద్ధత మరింత బలోపేతమవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -