వరుస నష్టాలకు చెక్‌- మార్కెట్ల ర్యాలీ!

break-for-stock-market-loss

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ట్రేడర్ల స్క్వేరప్‌ లావాదేవీలు, ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చాయి. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 72 మార్క్‌కు జారినప్పటికీ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే కొంతమేర ఊగిసలాటకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 224 పాయింట్లు జంప్‌చేసి 38,243 వద్ద నిలవగా.. నిఫ్టీ 60 పాయింట్లు ఎగసి 11,537 వద్ద స్థిరపడింది.
ఫార్మా హవా
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం దాదాపు 3 శాతం జంప్‌చేయగా.. మీడియా 1.6 శాతం తిరోగమించింది. రియల్టీ 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌, సిప్లా, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, లుపిన్‌, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌ 3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే జీ, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఐబీ హౌసింగ్‌, యస్‌బ్యాంక్‌, ఐషర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌ 2.5-0.5 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు ఓకే
బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్సులు 0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1567 లాభపడగా.. 1136 డీలాపడ్డాయి. కాగా.. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌లో అరబిందో, అదానీ ఎంటర్‌, గోద్రెజ్‌ సీపీ, గ్రాన్యూల్స్‌, బయోకాన్‌, టొరంట్‌ పవర్‌, టొరంట్‌ ఫార్మా, కేడిలా, ఎంఆర్‌పీఎల్‌, బలరామ్‌పూర్‌ 9.5-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు నాల్కో, శ్రీరామ్‌ ట్రాన్స్‌, చోళమండలం, బీఈఎల్‌, సన్‌ టీవీ, ఐడియా, పేజ్‌, మణప్పురం, రిలయన్స్ ఇన్‌ఫ్రా 7-2.4 శాతం మధ్య పతనమయ్యాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 384 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 177 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 33 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం నామమాత్రంగా రూ. 21 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.