అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు రావడం : సీఎం చంద్రబాబునాయుడు

cm chandrababunaidu fire on obsent mla's

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ప్రజాసమస్యలపై చర్చించే విషయంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సమాచారం తనకు చెప్పాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ప్రతిపక్షం సభలో లేకపోయినా సమావేశాలు బాగా జరిగాయి అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగేలా చూడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అటు, వైసీపీ తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. సభకు ఎందుకు రావడం లేదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని విమర్శించారు.